Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిని ముందుగానే గుర్తించాలి
- వాతావరణ మార్పులపై లాన్సెట్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లోని వలసకార్మికుల మీద వాతావరణ పరిస్థితులు చూపే ప్రభావంపై లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వివరించింది. వాతావరణ మార్పు కారణంగా తీవ్ర బాధితులుగా ఉండే దేశాల్లో భారత్ ఒకటిగా ఉండనున్నదని పేర్కొన్నది.పలు విద్యాసంస్థలు,ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలకు చెందిన స్కాలర్స్ పరిశోధన ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.ఈ నివేదిక సమాచారం ప్రకారం..గత ఐదేండ్లుగా వేడి గాలులకు ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ ఒకటి.2018-19లో భారత్తో పాటు బ్రెజిల్లో 'వేడి సంబంధ' మరణాలు అధికంగా ఉన్నాయి. 1990తో పోల్చితే 2019లో 15 శాతం అధికంగా వేడి ప్రభావానికి గురైంది. కాగా, వాతావరణ మార్పు వలసకార్మికులపై చూపే ప్రభావం గురించి ముందుగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని నివేదిక వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులుగా ఉన్న వ్యవసాయం,మత్స్యకార, అటవీ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపడంలో వాతావరణ మార్పు తరచూ కీలక అంశంగా ఉంటున్నది. ఈ కారణంగానే ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వాతావరణ మార్పు, విపత్తుల కారణంగా భారత్లో పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతు న్నాయి. ఒక అధ్యయనం ప్రకారం..దాదాపు 14 మిలియన్ల మంది (1.40 కోట్ల మంది) గతేడాది భారత్లో వలసలు జరిపారు.2050 నాటిది దేశంలో ఈ సంఖ్య 45 మిలియన్లు (4.5 కోట్ల మంది)గా ఉంటుందని అంచనా.