Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రి సెస్‌ను పామ్ ఆయిల్‌పై 7.5 శాతానికి తగ్గింపు
- సోయాబీన్, సన్‌ఫ్లవర్‌పై 5 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ : గత ఏడాది కాలంగా వంటనూనెల ధరలు నిరంతరంగా పెరుగుతున్న క్రమంలో వంట నూనెలపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టు పేర్కొంది. పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక సుంకాన్ని 2.5 శాతం నుండి జీరోకి తగ్గిస్తున్నట్టు కేంద్ర వినియోదారుల, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నూనెలపై అగ్రి-సెస్‌ను పామ్ ఆయిల్‌పై 20 శాతం నుంచి 7.5 శాతానికి, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతానికి తగ్గించినట్టు పేర్కొంది. మొత్తం సుంకం పామ్ ఆయిల్‌పై 7.5 శాతం, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతం, ఆర్బిడి పామ్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. తగ్గింపుకు ముందు, అన్ని రకాల వంట నూనెలపై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ 20 శాతం ఉంది. తగ్గింపు తర్వాత పామ్ ఆయిల్‌పై ఎఫెక్టివ్ డ్యూటీ 8.25 శాతం, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 5.5 శాతంగా ఉంటాయి. అదానీ విల్మార్, రుచి ఇండిస్టీస్ సహా ప్రధాన వంట నూనెల కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.7 తగ్గించారని, పండుగ సీజన్లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ధరలను తగ్గించారని ప్రభుత్వం తెలిపింది. జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (హైదరాబాద్), మోడీ నేచురల్స్ (ఢిల్లీ), గోకుల్ రీ-ఫాయిల్స్ అండ్ సాల్వెంట్, విజరు సోల్వెక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, ఎన్‌కె ప్రొటీన్స్ వంటివి కూడా వంట నూనె హౌల్‌సేల్ ధరలను తగ్గించాయని పేర్కొంది.అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన ప్రమేయం వల్ల వంటనూనెల ధరలను తగ్గించడానికి దారితీసిందని కేంద్ర వినియోదారుల, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తినదగిన ధరలు ఏడాది క్రితం కంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ అక్టోబర్ నుంచి తగ్గుదల ధోరణి ఉందని తెలిపింది. దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడానికి సెకండరీ ఎడిబుల్ ఆయిల్స్, ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపింది.