Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాల్యూ అడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను స్వల్పంగా తగ్గించాయి. వీటిల్లో ఎక్కువగా బిజెపి పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. గుజరాత్, మిజోరమ్, సిక్కిం ప్రభుత్వాలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను రూ.7 తగ్గించాయి. హర్యానా ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 12 తగ్గించింది. ఒడిషా ప్రభుత్వం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను రూ. 3 తగ్గించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.12 వ్యాట్‌ను తగ్గించింది. గోవా కూడా లీటర్ పెట్రోల్‌పై రూ.5.47లను, లీటర్ డీజిల్‌పై రూ 4.38లను తగ్గించింది. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై 5.5 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.10, డీజిల్ రూ.15లు తగ్గింది.