Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థా యికి చేరుకుంది. ఆకాశాన్ని దట్టమైన పొగమంచు కప్పివేసింది. బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినప్పటికీ.. చాలామంది టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగిందని అధికారులు తెలిపారు. వాయు కాలుష్యంతో చాలా మంది గొంతు దురద, కళ్ల నుంచి నీరు కారటం వంటి ఫిర్యాదులు చేశారు. నొయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. ఢిల్లీలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఎక్యూఐ ఒక్కసారిగా 526కు పెరిగింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరింది. శుక్రవారం ఉదయం నగరంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పీఎం 2.5, సాంద్రత 999 క్యూబిక్ మీటర్‌కు చేరుకున్నాయి. ఇది డబ్ల్యూహెచ్ఓ సూచించిన సురక్షిత పరిమితి 25ని దాటిందని అధికారులు తెలిపారు. ఏక్యూఐ 500 దాటిందంటే ప్రమాదకరస్థాయిలో కాలుష్యం ఉందని అర్థమని అన్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి వేగం కారణంగా కాలుష్య స్థాయిలు పెరిగి రాత్రి ఎనిమిది గంటలకు తీవ్రమైన జోన్లకు చేరిందని అన్నారు.