Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతులు నరికేస్తాను : అరవింద్ శర్మ
చత్తీస్‌గఢ్ : హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ కాంగ్రెస్ నేతలనుద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలకు పాల్పడ్డారు. తన పార్టీ నాయకుడైన మనీష్ గ్రోవర్ జోలికి వస్తే.. 'ఎవరినైనా సరే.. కళ్లు పీకేసి.. చేతులు నరికేస్తాను' అని బెదిరించారు. మనీష్ గ్రోవర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్ని 'నిరుద్యోగులనీ, మద్యానికి బానిసలైన వ్యసనపరులని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహంతో.. శుక్రవారం రోహ్తక్ జిల్లా కిలోయ గ్రామంలోని ఆలయంలో ఉన్న మనీష్‌ను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆయన దాదాపు ఎనిమిది గంటలపాటు ఆలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.. ఆయనతోపాటు మంత్రి రవీంద్రరాజు.. రోహ్తక్ మేయర్ మన్మోహన్గోయల్, మరో బీజేపీ నేత సతీష్ నందల్ కూడా ఆలయంలో ఉండిపోయారు. ఎనిమిది గంటల అనంతరం బయటకు వచ్చి కూడా... తన వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణ చెప్పడానికి మనీష్ తిరస్కరించారు. పైగా తనకిష్టం వచ్చినప్పుడు ఆలయానికి వస్తాను... ఇలాంటి వాటికి అస్సలు భయపడనంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.