Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే హడావుడిగా పెట్రో ధరలు తగ్గిస్తున్నట్టు ప్రచారం
- ఒకపక్క ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి..
- మరోపక్క యూపీ, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికలు
- పెట్రోల్, డీజిల్‌పై మూడు రెట్లు పెరిగిన పన్నులు
- మూడేండ్లలో రూ.8 లక్షల కోట్లు వసూళ్లు
న్యూఢిల్లీ : ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పన్నుల భారాన్ని మోపుతూ వచ్చారు. ప్రజలు, ప్రతిపక్షాలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేసినా మోడీ సర్కార్ మొండిగా ఎక్సయిజ్ డ్యూటీ (కేంద్రం పన్ను) పెంచింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి, డబుల్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు, వంట నూనె ధరలు తగ్గించినట్టు మరో కొత్త ప్రచారానికి బీజేపీ సర్కార్ తెరలేపింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. అందుకు బలమైన కారణం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవలి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ, ప్రతిపక్ష స్థానంలో ఉన్న రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోగా, మరికొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల తరువాత (మూడు, నాలుగు స్థానాల్లో) బీజేపీ అభ్యర్థులు నిలిచారు. దీంతో బీజేపీ నాయకత్వం షాక్‌కు గురైంది. ఈ ప్రభావం వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మాసాల్లో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చూపితే ఓటమి తప్పదేమోనని భయంలో బీజేపీ వెంటనే నివారణ చర్యలుకు పూనుకుందని తెలుస్తోంది. అందులో భాగంగానే హడావుడిగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ తగ్గించిందని, ఇందులో ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే వంట నూనెల ధరలు తగ్గించింది. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం ఈ హడావుడి ప్రచారానికి దిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్-రూపాయి మారకపు రేటు, పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తగ్గడం ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో మోడీ సర్కార్ విధించిన ఎక్సయిజ్ డ్యూటీ పెంచుకుంటూ పోయింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 2014లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లు, అప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ.71 ఉండేది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లు కాగా, లీటర్ పెట్రోల్ ధర రూ.111, డీజిల్ ధర 100 ఉంది.
2014 తరువాత పరిస్థితి ఏమిటి?
జూన్ 2014లో చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌ను లీటరుకు రూ.49 చొప్పున డీలర్‌కు విక్రయించేవి. డీలర్ మార్జిన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో కలిపి పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు రూ.74 ఉండేది. 2014లో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలో 66 శాతం చమురు మార్కెటింగ్ కంపెనీలకు, రిటైల్ ధరలో 34 శాతం డీలర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రూపంలో పొందాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.100 దాటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ ధరలో 42 శాతం మాత్రమే పొందుతున్నాయి. డీలర్ల కమీషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు 58 శాతానికి పెరిగాయి.
2014లో పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం ఆదాయం రాగా, ఇప్పుడు అది 32 శాతానికి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కాస్తా పెరిగింది. పెట్రోల్‌పై పన్నులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 2014లో 17 శాతం ఉండగా, అది ఇప్పుడు 23 శాతానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014లో వలే పెట్రోల్, డీజిల్‌పై పన్ను విధించినట్టయితే, ప్రస్తుతం లీటర్ పెట్రోల్ కేవలం రూ.66 ఉంటుంది. 2014 తరువాత, గత ఏడేండ్లలో డీజిల్‌పై పన్ను పెరగడం గమనార్హం. 2014లో డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ 8 శాతం ఉండగా, ఇప్పుడు రిటైల్ ధరలో 35శాతానికి పెరిగింది. 2014లో డీజిల్ నుంచి రాష్ట్ర పన్ను, వ్యాట్ రూపంలో 12 శాతం వసూలు చేయగా, ఇప్పుడు అది 15 శాతానికి చేరుకుంది. 2014 మాదిరిగానే డీజిల్‌పై పన్ను విధించినట్టయితే, ప్రస్తుతం ఒక లీటర్ డీజిల్‌ను రూ. 55కి పొందవచ్చు.
మూడేండ్లలో 8 లక్షల కోట్లు వసూళ్లు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను ఒక ఆదాయ వనరుగా చూస్తుంది. గత మూడేండ్లలో మోడీ సర్కార్ కేవలం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో రూ.8.12 లక్షల కోట్లకుపైబడి వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వసూళు చేసే మొత్తం 2014లో 75 వేల కోట్లు ఉంటే, 2021లో 3.60 లక్షల కోట్లకు పెరిగింది.
గత ఆరేళ్లలో ఒక్కసారి పన్ను పెంచలేద్ణు కె.ఎన్ బాలగోపాల్, కేరళ ఆర్థిక మంత్రి
తమ రాష్ట్రంలో గత ఆరేండ్లలో ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను పెంచలేదని, అందుకే ఇప్పుడు పన్ను తగ్గించే యోచన లేదని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేరళ ఇంధన పన్నును పెంచలేదని, ఎటువంటి సెస్ విధించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ''తాత్కాలికంగా పరువు నిలుపుకొనే చర్య''గా బాలగోపాల్ పేర్కొన్నారు.