Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళను విద్యుత్ మిగుల రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదనీ, దానికి అనుగుణంగానే తగిన ప్రాణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్) పూర్తి చేసిన అరిప్పరా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును తాజాగా పినరయి విజయన్ ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ.. వామపక్ష ప్రభుత్వం గత ఐదేండ్లలో అనేక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించిందని అన్నారు. అలాగే, విద్యుత్ ఉత్పత్తి ఒక్క పునరుత్పాదక ఇంధన వనరులపై మాత్రమే ఆధారపడకూడదని అన్నారు. జల విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. కేరళను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదనీ, ఈ ప్రాజెక్టులను పర్యావరణ స్నేహపూర్వక పద్ధతిలో అమలు చేస్తామని ఆయన చెప్పారు. 'నీరు, గాలి, సూర్యకాంతి నుంచి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయడమే రాష్ట్ర లక్ష్యం అని విజయన్ స్పష్టం చేశారు. కోజికోడ్ జిల్లాలోని కొడెంచెరిలో నదీ జలాల ప్రవాహంపై అరిప్పరా హైడ్రో విద్యుత్ ప్రాజెక్టును సీఐఏఎల్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో 14 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.