Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ఔషధ మొక్కకు ఎఫ్‌డీఏ గుర్తింపు
తిరువనంతపురం : నల్లని రంగులో నిగనిగలాడుతూ గుత్తులుగుత్తులుగా విరగగాసే కేరళలోని ఒక ఔషధ మొక్కకు అరుదైన గుర్తింపు లభించింది. స్థానికంగా 'మనతక్కాలి (నల్లకాశి - బ్లాక్ నైట్‌షేడ్ లేదా సోలానమ్ నిగ్రుమ్)గా పిలుచుకునే ఈ మొక్కకు మంచి ఔషధ గుణాలున్న మొక్కగా సాంప్రదాయ వైద్యంలో విశేష గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సైతం నిర్ధారించింది. రాజీవ్ గాంధీ జీవ సాంకేతిక కేంద్రం (ఆర్జీసీబీ) శాస్త్రవేత్తల పరిశోధనా పత్రాలను విశ్లేషించిన అనంతరం మనతక్కాలికి కాలేయ కేన్సర్‌ను నయం చేసే గుణాలున్నాయని ఎఫ్‌డీఏ తెలిపింది. అరుదైన జబ్బులకు నూతన చికిత్సా విధానాలను ఆవిష్కరించేందుకు, అభివృద్ధి చేసేందుకు 'ఆర్పాన్ డ్రగ్' పేరుతో ఎఫ్‌డీఏ గుర్తింపునిస్తుందనీ, ఈ గుర్తింపుతో తమ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని ఆర్జీసీబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రూబీ జాన్ ఆంటో తెలిపారు.