Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిమాపక అధికారి వెల్లడి
పూణె : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సరైన భద్రతా చర్యలు పాటించకపోవడమే కారణమని అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 11 మందిని బలిగొన్న ఈ ఆసుపత్రిలో స్థానిక పౌర సంస్థ జారీ చేసిన భద్రతా చర్యలేవీ తీసుకోలేదని సదరు అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఏడుగురు సభ్యులతో నియమించిన బృందం సోమవారం ప్రాథమిక నివేదికను సమర్పించనుంది.