Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది పోలీసులకు గాయాలు
ఫారూఖ్బాద్ : తోటి ఖైదీ డెంగ్యూతో మరణించడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక జైలు ఖైదీలు ఆదివారం రిసోర్ట్ను తగలబెట్ట్టడం, రాళ్ల దాడికి పాల్పడ్డంతో 30 మంది పోలీసులు గాయపడ్డారు. ఇక్కడి జిల్లా జైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ తోటి ఖైదీ ఒకరు డెంగ్యూతో సైఫై మెడికల్ కాలేజీలో మరణించినట్లు తెలియడంతో జైలులో మిగిలిన ఖైదీలు ఆందోళనలకు దిగారు. రిసోర్ట్ను దగ్ధం చేయడంతో పాటు, పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో డిప్యూటీ జైలర్‌తో సహా 30 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో 6 మంది ఖైదీలు కూడా గాయపడ్డారు. ఖైదీలు ఆందోళనకు దిగడంతో అదనపు బలగాలను అక్కడకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎస్పి అశోక్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులను శిక్షిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ సంజరు కుమార్ సింగ్ తెలిపారు.