Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆయుధాల చట్టం కింద ఢిల్లీలోని మూడు జిల్లాలో అక్టోబర్ నెలలో 100 మందిని పైగా అరెస్టు చేశారు. అధికారిక సమాచారం ప్రకారం వీరిలో 85 మందిని ఎక్సైజ్ చట్టం కింద, 22 మందిని ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. ఉత్తర ఢిల్లీ జిల్లాలో 18 మందిని ఆయుధాల చట్టం కింద అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి 8 దేశీవాళీ తుపాకీలు, 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగేయ ఢిల్లీ జిల్లాలో 18 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 6 తుపాకీలు, 11 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య ఢిల్లీ జిల్లాలో 68 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 23 తుపాకీలు, 45 లైవ్ కాట్రిడ్జ్‌లు, 40 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.