Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌర హక్కుల వైపు న్యాయమూర్తులు నిలబడితే.. వారిని నిందించలేరు : 'పెగాసస్ తీర్పు'లో సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ప్రభుత్వం అలా చేయకూడదు..
- 'పెగాసస్ తీర్పు'లో సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పౌర హక్కులు ప్రమాదంలో పడినప్పుడు..న్యాయస్థానాలు పౌరుల వైపే నిలబడతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.పౌరుల తరఫున నిలబడి ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తుందని పేర్కొన్నది.ఈక్రమంలో కోర్టుల్ని,న్యాయమూర్తుల్ని నిందించలేరని స్పష్టం చేసింది. 'పెగాసస్' కుంభకోణంపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుబట్టింది.ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా పోతామంటే ఎలా?ప్రభుత్వం అలా చేయడానికి వీల్లేదు...అని స్పష్టతని చ్చింది.ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.తీర్పులో పేర్కొన్న అంశాలపై మీడియాలో మరోమారు వార్తా కథనాలు వెలువడ్డాయి. ప్రాథమిక హక్కుల్లో ఒకటైన గోప్యతా హక్కును ఉల్లంఘించారని కేంద్రంపై ఆరోపణలు చేస్తూ అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులకు భంగం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కోర్టు అడిగిన సమాచారం ఇవ్వకుండా జాతీయ భద్రతను అడ్డుగా చూపి కేంద్రం తప్పించుకోలేదు. పౌరుల వైపు నిలబడి సమాచారం ఇవ్వాలని కోరుతున్న న్యాయవ్యవస్థపై నిందలు చేయరాదు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైతే కోర్టులు కచ్చితంగా కలుగజేసుకుంటాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.పెగాసస్ స్పైవేర్ వాడారా?లేదా?అన్నది సూటిగా చెప్పాలని ఆదేశించింది.
కేశవానంద భారతీ కేసు ప్రస్తావన
జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా 1973లో కేశవానంద భారతీ కేసులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇక్కడ గుర్తుచేసుకోవాలని (పెగాసస్‌పై తీర్పులో) సుప్రీంకోర్టు పేర్కొన్నది. ''భయం, పక్షపాతం లేకుండా భారత రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండటం న్యాయమూర్తుల ప్రాథమిక కర్తవ్యం''అని ఆనాడు జస్టిస్ ఖన్నా స్పష్టంగా చెప్పారు. ఆమేరకు న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు పూనుకుంటాయని సుప్రీం మరోమారు స్పష్టత నిచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక (కేంద్ర ప్రభుత్వం) విధానాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే నిశ్శబ్దంగా చూస్తూ ఉండలేమని కూడా సుప్రీం తెలిపింది.