Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు ప్రధాని నిర్దేశం
న్యూఢిల్లీ : బీజేపీ పట్ల ప్రజలకు విశ్వాసం పెంపొందించేలా వారధిగా కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. బీజేపీ కుటంబ పార్టీ కాదని, సామాన్యులకు, పార్టీకి మధ్య విశ్వాసాన్ని నింపే వారధిగా నేతలు పనిచేయాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తున్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ వంద కోట్ల డోసుల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రధాని మోడీని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సత్కరించారు. బీజేపీి జాతీయాధ్యక్షులు జెపి నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా తదితర సీనియర్ నేతలతో పాటు బీజేపీి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వీరిలో కొందరు నేరుగా హాజరుకాగా, మిగిలినవారు వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు.