Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హన్సి ఎస్పీ కార్యాలయం ముట్టడి
- నార్నౌండ్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
- నవంబర్ 9న ఉత్తరప్రదేశ్‌లో రైతులు ఆందోళన
- మహిళా రైతుల సంస్మరణ సభ
న్యూఢిల్లీ : నార్నౌండ్లో బీజేపీ ఎంపీ రామ్‌చందర్ జంగ్రాపై రైతుల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. శనివారం నుంచే వేలాది మంది రైతులు నార్నౌండ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దిగ్భ్రాంతికరమైన సంఘటనలో నార్నాండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బీజేపీ ఎంపీ జాంగ్రాకు నల్లజెండా చూపించినందుకు ఇద్దరు రైతులను అరెస్టు చేశారు. రైతులను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయగా, వారిపై కేసు కొనసాగుతోంది. ఈ ఘటనలో కుల్దీప్ సింగ్ రాణా అనే రైతు తీవ్రంగా గాయపడి జిందాల్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రాణా వయస్సు 40 ఏండ్లు, అతనికి చాలా తక్కువ భూమి ఉంది. రైతు ఉద్యమానికి మొదటి నుంచి మద్దతుదారు. రైతులపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలనీ, కుల్దీప్ సింగ్ రాణాకు గాయపడినందుకు మరో కేసు పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకుంటే, సోమవారం నుంచి హన్సి ఎస్పీ కార్యాలయాన్ని ఘెరావ్ చేస్తామని రైతులు ప్రకటించారు.
హర్యానా బీజేపీ నేత అరవింద్ శర్మ చేసిన ప్రకటనలను కూడా ఎస్కేఎం ఖండించింది. రైతులను ఆయన బెదిరించడం స్పష్టమైందనీ, నల్ల జెండాలతో ఆందోళనలు చేస్తున్న రైతుల కండ్లు పీకేస్తామనీ, చేతులు నరికివేస్తామని ఆయన అన్నారు. హర్యానాలో జరిగిన సమావేశంలో శర్మ చేసిన హింసాత్మకమైన, బెదిరింపు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్కేఎం ప్రకటన విడుదల చేయబడింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. భివానీలో బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్‌కు రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
పంజాబ్‌లో మహిళా రైతుల సంస్మరణ సభ
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని ఖివా దయాల్పురాలో అక్టోబర్ 28న టిక్రీ సరిహద్దులో అమరులైన ముగ్గురు మహిళా రైతులు (అమర్జిత్ కౌర్, గుర్మైల్ కౌర్, సుఖ్విందర్ కౌర్) సంస్మరణ సభ జరిగింది. వందలాది మంది రైతులు, ప్రజలు తరలివచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు ఎస్కేఎం నాయకులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటంలో ఈ మహిళల విప్లవ స్ఫూర్తిని కొనసాగిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు.
ఖరీఫ్ పంటలకంటే ధర తక్కువే...
అనేక రాష్ట్రాల్లో పండించిన ఖరీఫ్ పంటలు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా అమ్ముడవుతున్నాయి. వరి, బజ్రా, తణధాన్యాలు వంటి పంటలకు ఎంఎస్పీతో పోలిస్తే 33 శాతం తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుంది. ఎంఎస్పీ చట్టబద్ధమైన హామీగా మారితే తప్ప, అది కాగితంపైనే ఉంటుందని ఎస్కేఎం తమ వాదనను పునరుద్ఘాటించింది. అదే సమయంలో ఎరువుల కొరత మునుపెన్నడూ లేని సంక్షోభంగా మారింది. అనేక రాష్ట్రాల్లో డీఏపీ ఎరువులు అందుబాటులో లేవని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దామోV్‌ాలో రైతులు రహదారిని దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఎస్కేఎం పేర్కొంది.
9న యూపీలో రైతులు ఆందోళన
నవంబర్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జారీ మండిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి అజరు మిశ్రా టెనిని తొలగించాలనే డిమాండ్‌తో పాటు పలు డిమాండ్లను తెరపైకి తెచ్చింది.
వరి క్వింటాల్‌కు రూ.1,940 చొప్పున కొనుగోలు చేయాలి. ప్రభుత్వ సేకరణ కోసం రిజిస్ట్రేషన్ కోసం అధికారులు తీసుకున్న ప్రతి హౌల్డింగ్కు రూ. 300 అవినీతి సొమ్ము తిరిగి ఇవ్వాలి. ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ కంటే తక్కువ ధరలు
ఆ ప్రాంతంలో వేసిన అన్ని రకాల పంటలను సేకరించాలి. ఎకరాకు 11 క్వింటాళ్ల పరిమితిని తొలగించాలి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటకలో కూడా, రైతులు వరి సేకరణ, వరికి ఎంఎస్పీ పెరుగుదల కోసం ఆందోళన చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
గుణకు చేరిన నాగరాజ్ పాదయాత్ర
ఫిబ్రవరి 11న బాదల్పూర్ (కర్నాటక) నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించిన కర్నాటకకు చెందిన రైతు ఉద్యమ యువకుడు నాగరాజ్ అన్ని అవాంతరాలను అధిగమించి గుణకు చేరుకున్నారు. నాగరాజ్ ఇటీవలే తన తల్లిని కోల్పోయాడు. ఆమె అంత్యక్రియలకు హాజరు కావడానికి కేవలం రెండు రోజుల పాటు ఇంటికి వెళ్లిన నాగరాజు, పాదయాత్రను కొనసాగించాడు. ఈ హీరో స్ఫూర్తికి ఎస్కేఎం వందనాలు తెలిపింది.