Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్‌ఫర్డ్ వర్సీటీ ప్రపంచ పరిశోధకుల జాబితాలో టాప్-2 శాతం మంది 16 మంది జామియా వర్సీటీ పరిశోధకులు
న్యూఢిల్లీ : జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీకి (జేఎంఐ) చెందిన 16 మంది పరిశోధకులు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ప్రపంచలోని టాప్-2 శాతం పరిశోధకుల జాబితాలో ఉన్నారు. స్టాన్‌ఫర్డ్ వర్సీటీ విడుదల చేసిన ఈ సమగ్ర జాబితాలో మొత్తం 1,59,683 మంది వుండగా, అందులో దాదాపు 1500 మంది భారతీయులు ఉన్నారు. మొదటి జాబితాలో కెరీర్-లాంగ్ డేటా ఆధారంగా 8 మంది జేఎంఐ ప్రొఫెసర్లు జాబితాలో చోటుసంపాధించగా, 2020లో పనితీరు ఆధారంగా రెండో జాబితాలో జేఎంఐ నుంచి 16 మంది పరిశోధకులు చోటుసంపాధించారని సదరు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే 2020లో విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. జేఎన్‌యూ, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలను వెనక్కినెడుతూ.. 40 కేంద్రీయ వర్సిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారతీయ సంస్థలలో 2020లో 19 నుండి 12కి తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అంతిమంగా చెప్పాలంటే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మెరుగైన ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయం పనితీరులోనూ మెరుగైన, నాణ్యమైన ఫలితాలతో విదేశీ విద్యార్థులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మూల అంశాలు, గమ్యస్థాన దేశాల మధ్య మృదువైన దౌత్య రూపంగా కూడా పనిచేస్తుంది.అయితే, గత రెండు దశాబ్దాలుగా హింసాత్మక చర్యలు, మతపరమైన కథానాలతో జేఎంఐ పోరాడింది. మరీ ముఖ్యంగా బీజేపీ, అనుబంధ పార్టీలు, మద్దతుదారులు తరచుగా ఈ విశ్వవిద్యాలయం, దాని విద్యార్థులను ''జాతీయ వ్యతిరేకం'' పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జామియా మైనారిటీ హౌదాను తీసివేయడానికి 2017-2018 మధ్య మోడీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేసిందని అలీషన్ జాఫ్రీ పేర్కొన్నారు. బాట్లా ఎన్కౌంటర్ సమయంలో యూనివర్సిటీ తరపున న్యాయవాదులెవరూ హాజరుకాలేదు. బీజేపీ అగ్రనాయకులు చేసిన బెదిరింపుల గురించి స్క్రోల్.ఇన్ సంచలన నివేదికను సైతం విడుదల చేసింది. ఇక పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ ప్రాంతంలో శాంతియుతంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసు అధికారులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేయడం, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం, యూనివర్శిటీ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థులను గాయపర్చడం, లాఠీచార్జి చేయడం వంటివి జరిగాయి. 2020 జనవరి 30న సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న జామియాలోని విద్యార్థులపై జెవార్‌కు చెందిన ఒక మైనర్ కాల్పులు జరిపాడు. ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మైనర్‌ను అరెస్టు చేయగా, అతను ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు. షూటర్ సోషల్ మీడియా పోస్ట్‌లలో అతను బహిరంగ కార్యక్రమాలలో చేసిన ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయని నివేదికలు సైతం ఉన్నాయి. అయితే, మొత్తంగా శాంతియుతంగా నిరసన తెలిపిన నిరసనకారులనే నిందించడం గమనార్హం. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో హింసను ప్రేరేపించారనీ, ఈ 'కుట్ర'లో భాగమయ్యారని ఆరోపించబడిన అనేక మంది జామియా పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, మొత్తంగా గమనిస్తే కావాలనే జేఎంఐ, దాని విద్యార్థులపై కుట్రలకు తెరదీస్తున్నారనీ, అయినప్పటికీ.. అంతర్జాతీయంగా ఈ వర్సీటీ, విద్యార్థులు, పరిశోధకులు తమ సత్తాను చాటుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.