Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా అక్టోబర్ విప్లవ దినోత్సవం
న్యూఢిల్లీ: బోల్షివిక్ విప్లవం జరిగి 104ఏండ్లు పూర్త యినా ఆత్యాగాలను మరువలేమనివక్తలు కొనియా డారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ విప్లవం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వామపక్ష పార్టీలు, వివిధ సం ఘాలు అన్ని రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిం చాయి. ఢిల్లీలో సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో లెనిన్ విగ్రహానికి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు హన్నన్ మొల్లా, తపన్ సేన్, నీలోత్పల్ బసు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు జోగేంద్ర శర్మ తదిత రులు పాల్గొన్నారు. అలాగే త్రిపురలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అగర్తలా టౌన్ హాల్లో సభ జరి గింది. ఈసభలో మాజీముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, రాష్ట్ర కార్యదర్శి జితిన్ చౌదరి పాల్గొన్నారు. అలాగే త్రిపురలో అన్ని జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో అనేక ప్రాంతాల్లో అక్టోబర్ విప్లవం జయప్రదం దినోత్సవాన్ని నిర్వహిం చారు. కోలకతాలో లెనిన్ విగ్రహానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బిమన్ బసుతో సహా నేతలంతా నివాళులర్పించారు. అలాగే తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగాయి.