Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల కోసం మూడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం
న్యూఢిల్లీ : భోపాల్లోని యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీకేజీ ఘటనలోని బాధితుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన అబ్దుల్ జబ్బార్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన కూడా స్వయానా బాధితుడే. 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటనలో బతికిబయటపడిన వారి సంక్షేమం కోసం ఆయన అలుపులేని పోరాటం చేశారు. మూడు దశాబ్దాలకు పౖౖెగా ఆయన సాగించిన పోరాటం ఫలితంగా పలువురు బాధితులకు వైద్య, ఆర్థిక పునరావాసం అందింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును బహూకరించారు. భోపాల్లో జబ్బార్ భారుగా అందరికీ చిరపరిచితుడైన ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. రేకుల గదిలో భార్య, ముగ్గురు పిల్లలతో జీవించారు. 2019 నవంబరు 14న ఆయన మరణించేవరకు అక్కడే నివసించారు. సాయం చేస్తామంటూ ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, కార్పొరేట్ సంస్థలకు చెందిన మిత్రుల నుంచి పలుమార్లు ప్రతిపాదనలు వచ్చినా ఆయన తిప్పి కొట్టారు. ఎవరి కోసమైతే పోరాటం జరుపుతున్నారో ఆ బాధితులతోనే కలిసి వుండేందుకు ప్రాధాన్యతనిచ్చారు.