Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదో ర్యాంక్ నుంచి పదో ర్యాంక్‌కు తెలంగాణ
- ఏపీ మూడో ర్యాంక్ నుంచి తొమ్మిదో ర్యాంకు
న్యూఢిల్లీ : మౌలిక వసతుల్లో తెలుగురాష్ట్రాలు దిగజారాయి.2019లో తెలంగాణ ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 10 వ ర్యాంక్‌కు దిగజారింది. అలాగే 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఏపీ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయింది. సోమవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్ రాష్ట్రాల లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌ను విడుదల చేశారు. అందులో తెలంగాణ 2019లో 3.22 స్కోర్‌తో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది. 2021లో 3.14 స్కోర్‌తో పది ర్యాంక్‌కు పడిపోయింది. రోడ్ల నాణ్యత (3.48 స్కోర్), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.14 స్కోర్), మల్టీ మోడల్ టెర్మినల్ నాణ్యత (3.47 స్కోర్), గిడ్డంగులు నాణ్యత (2.94 స్కోర్), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (3.21స్కోర్), లాజిస్టిక్ సర్వీస్ నాణ్యత (3.52 స్కోర్), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.56స్కోర్), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.31 స్కోర్), టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకత (2.41 స్కోర్), కార్గో డెలివరీ రవాణా (3.67 స్కోర్), మోబైల్, ఇంటర్ నెట్ సర్వీస్ (3.66 స్కోర్), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.82స్కోర్), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.92స్కోర్) తదితర అంశాల్లో తెలంగాణ నిలిచింది.కాగా ఆంధ్రప్రదేశ్ 2019లో 3.42 స్కోర్‌తో మూడో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 3.17 స్కోర్‌తో తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారింది. రోడ్ల నాణ్యత (3.59 స్కోర్), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.26 స్కోర్), మల్టీ మోడల్ టెర్మినల్ నాణ్యత (3.38 స్కోర్), గిడ్డంగులు నాణ్యత (3.27 స్కోర్), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (2.92 స్కోర్), లాజిస్టిక్ సర్వీస్ నాణ్యత (3.55 స్కోర్), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.50 స్కోర్), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.35 స్కోర్), టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకత (2.47 స్కోర్), కార్గో డెలివరీ రవాణా (3.48 స్కోర్), మోబైల్, ఇంటర్ నెట్ సర్వీస్ (3.60 స్కోర్), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.61 స్కోర్), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.78 స్కోర్) తదితర అంశాల్లో ఏపీ నిలిచింది.గుజరాత్, హర్యానా, పంజాబ్ మొదటి మూడు ర్యాంక్‌లను సాధించాయి.