Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటన విచారణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తుపై విశ్వాసంలేదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హితవుపలికింది. కేంద్ర మంత్రి అజరు మిశ్రా తేనిని తక్షణమే బర్తరఫ్‌చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. లఖింపూర్ ఖేరీ మారణకాండపై దర్యాప్తును నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని ఎస్కేఎం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదని తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలిపిన రైతులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఎస్కేఎం ఆరోపించింది. ప్రజా వ్యతిరేక వైఖరి మానుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. రైతులపై నమోదైన అన్ని నకిలీ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
హర్యానాలో వేలాది మంది రైతుల నిరసన
హర్యానాలోని హన్సి ఎస్పీ కార్యాలయాలన్ని వేలాది మంది రైతులు ఘెరావ్ చేశారు. బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా పాల్గొన్న నల్లజెండాలతో నిరసనలో ముగ్గురు రైతులపై ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నార్నాండ్ పోలీస్ స్టేషన్లో రైతులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అతని భార్య, కుమార్తె సోమవారం హర్యానాలోని హన్సీ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు.
ముంబాయిలో భారీ మహాపంచాయత్ చారిత్రాత్మక రైతుల పోరాటం ఏడాది పురస్కరించుకుని నవంబర్ 28న ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో భారీ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ జరగనున్నది.