Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్లలో ఒకటైన లేబర్ ప్రొగ్రెస్సివ్ ఫ్రంట్ (ఎల్పీఎఫ్) అధ్యక్షులు వి.సుబ్బరామన్ మృతిపై సీఐటీయూ తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెలికాం ట్రేడ్ యూనియన్ ఉద్యమం నుంచి వచ్చిన టెలికాం ఎంప్లాయిస్ ప్రోగ్రెసివ్ యూనియన్ (టీఈపీయూ) అవిర్భావం నుంచి దాని నాయుకుడిగా సబ్బరామన్ ప్రశంసలు అందుకున్నారని, తరువాత ఎల్పీఎఫ్ అధ్యక్షులయ్యారని ప్రకటనలో తెలిపారు. అప్పటి నుంచి ఎల్పీఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.షణ్ముగంతో కలిసి అన్ని జాతీయ ఐక్య ట్రేడ్ యూనియన్ దీక్షలు, ఉద్యమాల్లో చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించారని చెప్పారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తున్న సమయంలో సుబ్బరామన్ మరణించడం ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి ప్రధానంగా ఎల్పిఎఫ్కు గొప్ప లోటని సిఐటియు తెలిపింది. ఎల్పీఎఫ్ నాయకుల, సభ్యుల విచారాన్ని పంచుకున్న సీఐటీయూ, సుబ్బరామన్ను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియచేసింది.