Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్ల రద్దు ఓ తుగ్గక్ చర్య అని ఆనాడే చెప్పాం
- కేరళ మాజీ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్
తిరువనంతపురం: నేటికి సరిగ్గా అయిదేండ్ల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు గురించి ప్రకటించినప్పుడే ఇది తుగ్లక్ చర్య అని, దేశ ఆర్థిక వ్యవస్థపై వినాశకర ప్రభావం చూపుతుందని మేం చెప్పాం. అదే నిజమైంది అని కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ చెప్పారు. నవంబరు8తో నోట్ల రద్దుకు ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా 'దేశాభిమాని' పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పై విధంగా పేర్కొన్నారు.. 2016 నవంబరు7 వ తేదీ రాత్రి జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, వెయ్యి, రెండు వేల నోట్లను రద్దు చేస్తున్నామని, ఈ నిర్ణయం. అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించారు.. కేంద్ర ప్రభుత్వ చర్యపై దేశ వ్యాపితంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని కేరళ ఆర్థిక మంత్రి హౌదాలో తాను అప్పటిక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో తెలియజేశానని ఐజాక్ తెలిపారు.. మనిషి శరీరంలో రక్తం ఎటువంటి పాత్ర పోషిస్తుందో, ఆర్థిక వ్యవస్థలో డబ్బు కూడా అటువంటి పాత్రే పోషిస్తుంది. రక్తాన్ని మొత్తంగా ఒకేసారి తీసివేస్తే ఏమవుతుంది? మనిషి నిర్జీవంగా మారతాడు. నోట్ల రద్దుకు ఇదే వర్తిస్తుందని తాను చెప్పాను. డబ్బు చలామణిలో లేకపోతే వేతనాలు చెల్లించడం కుదరదు. సరుకుల క్రయ విక్రయాలు ఆగిపోతాయి. ఫలితంగా ఆర్థిక స్తబ్దత ఏర్పడుతుంది. మోడీ ఆ రోజు చెప్పిందేమిటి? పాత నోట్లు రద్దు చేసిన 50 రోజుల్లో కొత్త నోట్లు వచ్చేస్తాయని, దాంతో మామూలు పరిస్థితి తిరిగి ఏర్పడుతుందని అన్నారు.. కానీ, జరిగిందేమిటి? .ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత దీర్ఘకాలంపాటు సాగింది. చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోగలిగే స్థితి లేదు. దీంతో దేశం మాంద్యంలోకి నెట్టబడిందని ఐజాక్ వివరించారు. నల్ల డబ్బును, నకిలీ నోట్లను అరికట్టవచ్చని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అది కూడా బోగస్ అని తేలిపోయింది. నల్ల ధనంలో అత్యధిక భాగం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. దేశీయంగా ఉన్న నల్ల డబ్బు బంగారం, భూముల రూపంలో ఉంది. నోట్లను రద్దు చేసి కొత్త నోట్లు జారీ చేయడం వల్ల 50 లక్షల కోట్ల దాకా నల్ల డబ్బు బ్యాంకులకు తిరిగి రాదని బిజెపి భావించింది. అది కూడా తప్పు అని తేలిపోయింది. ఆర్బిఐ వార్షిక నివేదిక (2017-18)ను కేంద్ర ఆర్థిక మంత్రి విడుదలజేస్తూ రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం తిరిగి వచ్చేశాయన్నారు.. దీంతో నల్ల డబ్బును వెలికి తీయడమే నోట్ల రద్దు ఉద్దేశమన్న మోడీ మాటలు నిజం కాదని తేలిపోయిందని కేరళ మాజీ ఆర్థిక మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు.
నల్లడబ్బును బయటకు తీస్తామన్న ప్రకటనలు తుస్సుమనిపోవడంతో కరెన్సీ చెల్లింపుల స్థానే డిజిటల్ చెల్లింపులను పెంచడమే దీని ఉద్దేశమని మోడీ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. పన్నుల చెల్లింపుతో సహా అన్ని లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో జరగాలని ఆదేశించింది. రిజర్వుబ్యాంక్ రెండు రోజుల క్రితం విడుదలజేసిన గణాంకాలను బట్టి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ విలువ 2016 నవంబరులో 17.97 లక్షల కోట్లు ఉండగా, , 2021 అక్టోబరు నాటికి అది 28.30 లక్షల కోట్లకు పెరిగింది. అంటే కరెన్సీ వినియోగం 57 శాతం మేర పెరిగిందన్న మాట. అసలు ఈ నోట్ల రద్దు ఆలోచన ఆర్థిక వేత్తలు సూచించినది కాదు, నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయంలోని కొందరు ఆర్థిక మోసగాళ్ల పుర్రెలో పుట్టిందే ఇది అని ఐజాక్ పేర్కొన్నారు. నోట్ల పై నిషేధం వల్ల బిజెపికి బాగానే లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో నల్ల ధనాన్ని వినియోగించే అవకాశం కాంగ్రెస్ వంటి పార్టీలకు , కొన్ని ప్రాంతీయ పార్టీలకు లేకుండా అది చేసింది. తాను మాత్రం యథేచ్ఛగా నల్లడబ్బును ఉపయోగించుకోగలిగింది. అమిత్‌షా, మరి కొందరు పెద్దలు బ్యాంకులను కంట్రోల్ చేయడం ద్వారా బీజేపీ బ్లాక్‌మనీని తేలికగా మార్చగలిగారు. ఎన్నికల్లో దానిని యథేచ్చగా ఖర్చు చేశారని ఐజాక్ పేర్కొన్నాఉ.. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం అంతా ఇంతా కాదు.లక్షలాది చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూత పడ్డాయి. చిరు వ్యాపారాలు దెబ్బతినిపోయాయని ఆయన వివరించారు.