Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్బంగా మంగళవారం ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ మిషన్ లీగల్ సర్వీస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వీఐటీ - ఏపీ స్కూల్ ఆఫ్ లా(వీఎస్ఎల్)ని హైకోర్టు మిషన్ లీగల్ సర్వీసెస్లో చేరడానికి ఎంపిక చేసిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వీఐటీ- ఏపీ విశ్వవిద్యాలయం తన దత్తత గ్రామాలైన ఐనవోలు, శాఖమూరు, వెలగపూడిలలో చట్టాలు, న్యాయ సేవలపై అవగాహన కల్పించడానికి దోహదం చేయనుందని పేర్కొంది. తొలుత ఈ కార్యక్రమాన్ని ఐనవోలులో ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రెటరీ జస్టిస్ రమణ కుమారి ప్రారంభించారని తెలిపింది. దీనికి ఆ విద్యా సంస్థ స్కూల్ ఆఫ్ లా డీన్ బెనర్జీ చక్కా, ప్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ మహతి, మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జీ బి శేషయ్య పాల్గొన్నారని వెల్లడించింది.