Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి అమిత్‌షాకు మిజోరం సీఎం లేఖ
ఐజ్వాల్: కేంద్ర ప్రభుత్వం నియమించిన మిజోరం కొత్త ప్రధాన కార్యదర్శి రేణుశర్మ నియామకాన్ని పున:పరిశీలించాలని రాష్ట్ర సీఎం జొరాంథంగా.. కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు గమనిస్తే ఎన్డీయేలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయ అనే అనుమానం కలుగుతోంది. వివరాళ్లోకెళ్తే.. అమిత్‌షాకు రాసిన లేఖలో తన క్యాబినెట్లో పలువురు మంత్రులకు హిందీ తెలియదనీ, కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని సీఎం జొరాంథంగా పేర్కొన్నారు. అయితే, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు, సీఎం జొరాంథంగా.. అమిత్‌షాకు ఈ లేఖ రాయడం సంచలనంగా మారింది. సీఎస్ నియామక పున:పరిశీలన గురించి పేర్కొంటూ మిజోరం కేబినెట్లోని చాలా మంది మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు హిందీ రాదని, ఇంగ్లీష్ కూడా సరిగా అర్థం చేసుకోలేరని కారణాలను చెప్పుకొచ్చారు.
మిజో భాష తెలిసిన వారిని నియమించాల్సిందిగా కోరారు. ప్రస్తుత అదనపు ముఖ్య కార్యదర్శి జేసీ రామ్థంగాకు పదోన్నతి కల్పించి.. సీఎస్‌గా నియమించాలంటూ ప్రతిపాదించారు. దీనికి తోడూ తాను ఎన్డీయేలో నమ్మక భాగస్వామిగా ఉన్నాననీ, చాలా రాష్ట్రాల్లో అనేక పార్టీలు కూటములు మారాయంటూ పేర్కొనడం గమనార్హం.