Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీలో ఆయన తుపాకీ నుంచే బుల్లెట్లు పేలాయి
- అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపాడు
- మూడు ఆయుధాలు ఉపయోగించారు
- స్పష్టం చేసిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ మారణ కాండలో రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాల్పులు జరిపినట్టు స్పష్టమైంది. ఆయన తుపాకీ నుంచి బుల్లె ట్లు పేలినట్టు, ఈ కాల్పుల్లో మూడు ఆయుధాలను ఉపయోగించినట్టు తేలింది. ఈ మేరకు ఫోరెన్సిక్‌సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక ధవీకరించింది. అక్టోబర్ 3న లఖింపూర్ మారణకాండలో రైతులపై ఆశిష్ మిశ్రా కావాలనే కాల్పులు జరిపినట్టు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకి త్దాస్ కూడా కాల్పులు జరిపినట్టు ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికలో పేర్కొంది. కాల్పులకు ఉపయోగించిన మూడు ఆయుధాల్లో రైఫిల్, రిపీటర్ గన్, పిస్టల్ ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో స్పష్టమైంది. ఆశిష్ మిశ్రా రైఫిల్, అంకిత్ దాస్ పిస్టల్, లతీఫ్ గన్ను స్వాధీనం చేసుకుని బాలిస్టిక్ పరీక్షకు పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆశిష్‌మిశ్రా, అంకిత్ దాస్‌ల లైసెన్స్ ఆయుధాలను లఖింపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని తుపాకులను అక్టోబర్ 15న ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా, మంగళవారం నివేదిక వచ్చింది.
లఖింపూర్ హింస విచారణ
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులుచేస్తున్న ఆందోళనపైకి కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహన కాన్వారుతో దూసుకెళ్లారు. ఈ మారణకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టుతో సహా 8 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో రోజుకో వాస్తవం వెల్లడవుతున్నది. అక్టోబర్ 4న యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆశిష్ మిశ్రాతో సహా 15-20 మంది గుర్తుతెలియని నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120బీ, 147, 148, 149, 279, 302, 304ఏ, 338 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు సిట్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ (రిటైర్డ్) ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. అక్టోబరు 6న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండు నెలల వ్యవధిలో కమిషన్ విచారణ పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించి డీఐజీ (హెడ్‌క్వార్టర్స్) ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలో 9 మంది సభ్యుల పర్యవేక్షణ కమిటీని యూపీ పోలీసులు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా, అంకిత్ దాస్, అతని గన్‌మెన్ లతీఫ్‌లను 5 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. అక్టోబర్ 13న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం లఖింపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. సుప్రీంకోర్టు జోక్యంతో నిందితుల అరెస్టు, సాక్షుల వాగ్మూలాల సేకరణ వంటివి జరుగుతున్నాయి. వివిధ సందర్భాల్లో పోలీసుల దర్యాప్తు పట్ల సుప్రీంకోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. తాజాగా సోమవారం సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం దర్యాప్తు పురోగతిపై అసంతప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.