Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో 12, ఏపీలో 11 స్థానాలకు...
- షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
న్యూఢిల్లీ : తెలుగురాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారామోగింది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో 12స్థానిక సంస్థల ఎమ్మెల్సీస్థానాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎనిమిది జిల్లాల్లో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనుంది. ఏపీలో 11 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం 2021 ఆగస్టు 8తో ముగిసింది. ఈస్థానాలకు ఎన్నికలను నిర్వ హించేందుకు నవంబర్ 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 23ఆఖరి తేదీ. అలాగే నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్లో తెలిపింది. పోలింగ్ డిసెంబర్ 10 ఉదయం 8 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగు తుందనీ, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 14న జరుగు తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటకలో 20 జిల్లాల్లో 25 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, మహారాష్ట్రలో ఏడు జిల్లాల్లో ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. తెలం గాణలో అదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురా ణం సతీష్ కుమార్, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ తేర చిన్నప రెడ్డి, మెదక్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి, నిజామాబాద్ స్థాని క సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఖమ్మం స్థాని క ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ స్థానిక ఎమ్మెల్సీలు టి.బానుప్రసాద్ రావు, నరదాసు లక్ష్మణ్ రావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కుచుకుల్ల దామోదర్ రెడ్డి, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజుల పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియనుంది.