Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీకి చెందిన ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏపీకి చెందిన పలువురు ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫారసులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు సుప్రీం కోర్టు రిజర్వు చేసిన విషయం విదితమే. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ ఎంఆర్షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫారసులకు విరుద్ధంగా 17 మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేశారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.