Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్‌పై ఢిల్లీ భేటీ డిక్లరేషన్
- ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపు
న్యూఢిల్లీ : ఆఫ్ఘన్ గడ్డ తీవ్రవాదులకు అడ్డాగా మారకుండా చూడాలని భారత్, రష్యా, ఇరాన్‌తో సహా ఎనిమిది దేశాలు కోరాయి. ఆ దేశంలో .నిజమైన ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని అవి విజ్ఞప్తి చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై భారత్ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన సమావేశం ముగింపు సందర్భంగా ఈ దేశాల భద్రతా దళాల అధికారులు (ఎన్ఎన్ఎలు) బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ ప్రజలకు తక్షణమే మానవతా దృక్పథంతో సహాయం చేయాలని పిలుపునిచ్చింది. ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రత్యక్షంగా, హామీ ఇచ్చిన విధంగా సహాయాన్ని కొనసాగించాలని పేర్కొంది. ఈ సమావేశానికి భారత్, రష్యా, ఇరాన్‌తోపాటు మధ్య ఆసియా దేశాలు కజఖ్‌స్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారులు హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ హాజరుకాలేదు.ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిణామాలు ఆ దేశానికే కాకుండా సరిహద్దు దేశాలకూ చిక్కులు కలిగించేవేనని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఆందోళన వ్యక్తం చేశారు.