Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ప్రతి ఏటా క్రమంగా కిందకు...
- పీపీఏసీ ఆయిల్, గ్యాస్ డేటా-2021
న్యూఢిల్లీ: దేశంలో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ఉత్పత్తి తగ్గుతుంది. ప్రతి ఏడాది ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కేంద్ర పెట్రోలియం, సహజ గ్యాస్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) దేశీయ ఆయిల్, గ్యాస్ డేటా-2021ని విడుదల చేసింది. 2018-19లో దేశంలో 34.2 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) ముడి చమురు ఉత్పత్తి కాగా, 2019-20 నాటికి 32.2 ఎంఎంటీకి తగ్గింది. 2020-21లో 30.5 ఎంఎంటీ మాత్రమే ఉత్పత్తి అయింది. మూడేండ్లలో దాదాపు 4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తగ్గింది. 2021-22 (ఏప్రిల్-సెప్టెంబర్) వరకు ప్రస్తుత ఏడాదిలో కేవలం 14.9 ఎంఎంటీ ఉత్పత్తి మాత్రమే జరిగింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)లో 2019-20లో 19.2 ఎంఎంటీ ముడి చమురు ఉత్పత్తి కాగా, 2020-21 నాటికి 19.1 ఎంఎంటీ ఉత్పత్తి అయింది. 2020-21లో ఉత్పత్తి స్వల్పంగా తగ్గింది. 2020-21 సెప్టెంబర్లో 1.6 ఎంఎంటీ ఉత్పత్తికాగా, 2021-22లో 1.7 ఎంఎంటీ ఉత్పత్తి లక్ష్యం కాగా..దాన్ని చేరుకోలేకపోయింది. 2021-22లో 1.5 ఎంఎంటీ ఉత్పత్తి అయింది. 2020-21 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 9.6 ఎంఎంటీ ఉత్పత్తి కాగా, 2021-20లో 10.1 ఎంఎంటీ లక్ష్యం పెట్టుకుంది. అయితే లక్ష్యాన్ని చేరుకోలేదు. 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 9.2 ఎంఎంటీ మాత్రమే ఉత్పత్తి అయింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 2019-20లో 3.2 ఎంఎంటీ ముడి చమురు ఉత్పత్తి కాగా, 2020-21 నాటికి 2.9 ఎంఎంటీ ఉత్పత్తి అయింది. 2020-21లో ఉత్పత్తి తగ్గింది. 2020-21 సెప్టెంబర్లో 0.2 ఎంఎంటీ ఉత్పత్తికాగా, 2021-22లో 0.3 ఎంఎంటీ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 2021-22లో 0.2 ఎంఎంటీ ఉత్పత్తి చేసింది. 2020-21 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.5 ఎంఎంటీ ఉత్పత్తి కాగా, 2021-20లో 1.5 ఎంఎంటి లక్ష్యం పెట్టుకుంది. టార్గెట్ను చేరుకొని 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.5 ఎంఎంటీ ఉత్పత్తి చేసింది. ప్రయివేట్, జాయింట్ వెంచర్స్ (జేవీఎస్) 2019-20లో 8.2 ఎంఎంటీ ముడి చమురు ఉత్పత్తి కాగా, 2020-21 నాటికి 7.1 ఎంఎంటీ ఉత్పత్తి అయింది. 2020-21లో ఉత్పత్తి తగ్గింది. 2020-21 సెప్టెంబర్లో 0.6 ఎంఎంటీ ఉత్పత్తికాగా, 2021-22లో 0.6 ఎంఎంటీ ఉత్పత్తి లక్ష్యం కాగా.. 2021-22లో 0.6 ఎంఎంటీ మాత్రమే ఉత్పత్తి చేసింది. 2020-21 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 3.6 ఎంఎంటీ ఉత్పత్తి కాగా, 2021-20లో 3.8 ఎంఎంటీ లక్ష్యం పెట్టుకుంది. టార్గెట్ను చేరుకొని 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 3.6 ఎంఎంటీ ఉత్పత్తి చేసింది.
ఆయిల్, గ్యాస్ దేశీయ ఉత్పత్తి
దేశంలో ఆయిల్, గ్యాస్ దేశీయ ఉత్పత్తి కూడా తగ్గింది. 2019-20లో 63.4 ఎంఎంటీ ఉండగా, 2020-21 నాటికి 59.2 ఎంఎంటీకి తగ్గింది. 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 31.8 ఎంఎంటీ ఉత్పత్తి అయింది.
ముడి చమురు, పెట్రో ఉత్పత్తుల దిగుమతి
విదేశాల నుంచి ముడి చమురు, పెట్రో ఉత్పత్తులు దిగుమతి పెరిగింది. 2020-21 సెప్టెంబర్లో ముడి చమురు 15.2 ఎంఎంటీ దిగుమతి చేసుకోగా, 2021-22 సెప్టెంబర్లో 17.4 ఎంఎంటీ దిగుమతిఅయింది. 2020-21 (ఏప్రిల్-సెప్టెంబర్)లో 89.2 (22.4 బిలియన్ డాలర్లు) ఎంఎంటీ దిగుమతి చేసుకోగా, 2021-22 (ఏప్రిల్-సెప్టెంబర్)లో 100.7 (51 బిలియన్ డాలర్లు)ఎంఎంటి దిగుమతి చేసుకున్నాం. అలాగే పెట్రోలియ ఉత్పత్తులు 2020-21 సెప్టెంబర్లో 3.1 ఎంఎంటీ దిగుమతి చేసుకోగా, 2021-22 సెప్టెంబర్లో 3.8 ఎంఎంటీ దిగుమతి చేసుకున్నాం. 2020-21 (ఏప్రిల్-సెప్టెంబర్)లో 20.9 (5.7 బిలియన్ డాలర్లు) ఎంఎంటీ దిగుమతి చేసుకోగా, 2021-22 (ఏప్రిల్-సెప్టెంబర్)లో 19,9 (10.2 బిలియన్ డాలర్లు)ఎంఎంటి దిగుమతి చేసుకున్నాం. 2019-20లో మొత్తం 227 ఎంఎంటీ ముడి చమురు దిగుమతి చేసుకోగా, అందుకు రూ.7,17,001 (1,01,376 మిలియన్ డాలర్లు) కోట్లు అయింది. 2020-21లో 196.5 ఎంఎంటీ దిగుమతి చేసుకోగా, అందుకు రూ.4,59,779 (62,248 మిలియన్ డాలర్లు) కోట్లు అయింది.
ప్రపంచంలో పెట్రో ఉత్పత్తి, వినియోగం
ప్రపంచ వ్యాప్తంగా 2018-19లో 262.4 ఎంఎంటీ ఉత్పత్తి కాగా, 2019-20 నాటికి 262.9 ఎంఎంటీ ఉత్పత్తి అయింది. అదే 2020-21లో పెట్రో ఉత్పత్తుల ఉత్పత్తి 233.5 ఎంఎంటీ కి తగ్గింది. దాదాపు 30 ఎంఎంటి ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుత సంవత్సరం (2021-22 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) 119.1 ఎంఎంటీ మాత్రమే జరిగింది. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2018-19లో 213.2 ఎంఎంటీ, 2019-20 నాటికి 214.1 ఎంఎంటీకి పెరిగింది. 2020-21 నాటికి కొంత 194.3 ఎంఎంటీకి వినియోగం తగ్గింది. ప్రస్తుత సంవత్సరం 2021-22 (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) 95.6 ఎంఎంటీ వినియోగం జరిగింది.