Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది సజీవదహనం
జైపూర్ : రాజస్తాన్‌లో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 22 మంది గాయాల పాలయ్యారు. బార్మర్ జిల్లాలోని బార్మర్-జోధ్‌పూర్ జాతీయ రహదారిపై భండియావాస్ గ్రామ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢకొీన్నాయి. దీంతో, ఒక్కసారిగా రెండు వాహనాల్లోనూ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పదిమంది మరణించారనీ, ఒకరు ఆస్పత్రిలో మరణించారని బార్మర్ ఎస్పి దీపక్ భార్గవ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిదిమందిని జోదపూర్ ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన షారుఖ్ జోధ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదసమయంలో తనతోపాటు బస్సు నిండా ప్రయాణికులు న్నారని చెప్పారు. గాయపడిన వారందరికీ పూర్తిస్థాయిలో అత్యుత్తమ వైద్యసేవ లందించాలని బార్మర్ జిల్లా కలెక్టర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తామని ట్వీట్‌చేశారు. ఈఘటనపై ప్రధానిమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుం బాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.