Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐకి రూ.17,408 కోట్లు
- జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ నిబంధనలకు ఆమోదం
- నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్
- ఇథనాల్ సేకరణకు ఆమోదం
- కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే 2014-15 నుంచి 2020-21 వరకు పత్తి సీజన్ (అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు) కనీస మద్దతు ధర ఆపరేషన్ల కింద జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి రూ.17,408.85 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం (15వ ఆర్థిక సంఘం కాలపరిమితి) వరకు ఎంపీల్యాడ్స్ పునరుద్ధరణ, కొనసాగింపునకు కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఎంపీల్యాడ్స్ కింద తమ నియోజకవర్గాల్లో తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుధ్యం, రోడ్లు మొదలైన వాటికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంబంధమైన పనులను సిఫార్సు చేయడానికి ఎంపీలను అనుమతించడం ఈ పథకం లక్ష్యం. ఒక ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు ఇస్తారు. ఒక్కొక్కసారి రూ.2.5 కోట్ల చొప్పున రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తారు. కరోనా కారణంగా 2020 ఏప్రిల్ 6న జరిగిన కేంద్ర మంత్రి వర్గంలో 2020-21నుంచి2021-2022 ఆర్థిక సంవత్స రంలో ఎంపీల్యాడ్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల నుంచి 15 ఆర్థిక సంఘం కాలపరిమితి (2025-26) వరకు ఎంపీల్యాడ్స్ కొనసాగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
పత్తి రైతుల కోసం..
2014-15 నుంచి 2020-21 (30 అక్టోబర్ 2021) వరకు పత్తి సీజన్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి రూ.17,408.85 కోట్ల మద్దతు ధరకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు 2014-15 నుంచి 2020-21 వరకు పత్తి ధరలు ఎంఎస్పీ ధరల కార్యకలాపాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీని అమలు దేశ ఆర్థిక కార్యకలాపాల్లో పత్తి రైతులను కలుపుకుపోయేలా చేస్తుందనీ, మద్దతు ధర కార్యకలాపాలు పత్తి ధరలను స్థిరీకరించడానికి, రైతు కష్టాలను తగ్గించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 58 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారనీ, పత్తి ప్రాసెసింగ్, వాణిజ్యం వంటి సంబంధిత కార్యకలాపాల్లో 4 నుంచి 5 కోట్ల మంది ప్రజల జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. 202-21 పత్తి సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం 133 లక్షల హెక్టార్లు, 360 లక్షల బేళ్ల ఉత్పత్తి అవుతందని అంచనా ఉందని అన్నారు. ఇది ప్రపంచ పత్తి ఉత్పత్తిలో 25 శాతం వాటా కలిగి ఉందని, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్(సిఎసిపి) సిఫార్సుల ఆధారంగా భారత ప్రభుత్వం విత్తన పత్తి (కపాస్) ఎంఎస్పిని నిర్ణయించిందని అన్నారు.
జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ నిబంధనలకు ఆమోదం
జూట్ ఇయర్ 2021-22 (1 జూలై 2021 నుంచి 30 జూన్ 2022 వరకు) ప్యాకేజింగ్‌లో తప్పనిసరిగా జనపనారను ఉపయోగించడం కోసం రిజర్వేషన్ నిబంధనలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. జూట్ ఇయర్ 2021-22 కోసం ఆమోదించబడిన తప్పనిసరి ప్యాకేజింగ్ నిబంధనలు ఆహార ధాన్యాలు 100 శాతం, చక్కెర 20 శాతం జనపనార సంచుల్లో తప్పని సరిగా ప్యాకింగ్ చేయాలని నిర్ణయించింది. జనపనార ప్యాకేజింగ్ మెటీరియల్ చట్టం నిబంధనలు అమలులోకి తీసుకురావడం ద్వారా 2020-21లో దేశంలో ఉత్పత్తి చేయబడిన ముడి జనపనారలో ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం 66.57 శాతం వినియోగించారని తెలిపారు.
జనజాతీయ గౌరవ్ దివస్
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15న జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించేం దుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆ రోజున బ్రిటిష్ వలసవాద,దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమిం చిన బిర్సా ముండా జయంతి అని పేర్కొంది. గిరిజన ప్రజలు,సంస్కృతి,విజయాల75ఏళ్ల అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి,స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15నుండి నవంబర్ 22వరకు వారం రోజుల పాటు వేడుకలను నిర్వహించనుంది.2021-22 షుగర్ సీజన్లో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపె నీల ద్వారా ఇథనాల్ సేకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించి ంది.వివిధ చెరకు ఆధారిత ముడి పదార్థాల నుంచి పొంది న అధిక ఇథనాల్ ధరను నిర్ణయించింది. ఈ ధరలు డిసెం బర్ 2021నుంచి30నవంబర్2022వరకు వర్తిస్తాయి.