Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాలీదళ్ నాయకుల కాల్పులు
- వాహనంతో కిలో మీటరుపైగా ఈడ్చుకెళ్ళిన వైనం
- తీవ్రంగా ఖండించిన ఎస్కేఎం
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
- నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ మారణకాండకు మరువకముందే పంజాబ్‌లో మరో మారణకాండ చోటుచేసుకున్నది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకునేందుకు వెళ్ళిన అన్నదాతలపై పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో కాల్పులకు తెగబడ్డారు. ఫిరోజ్పూర్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నాయకులు వారి వాహనంతో ఐదుగురు రైతులను ఈడ్చుకు తీసుకెళ్ళి చితకబాదారు. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి వచ్చిన ఎస్ఏడీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేరుకున్నారు. ఆమెను కలిసి తమ గోడును వెలబుచ్చుకునేందుకు రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని జరగనివ్వబోమనీ, తరువాత కలుస్తానని రైతులను కౌర్ కోరారు. ఆ తరువాత రైతులు ఎస్ఏడీ నాయకులను కలవడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించారు. ఎస్ఏడీ మాజీ ఎమ్మెల్యే నోని మాన్ తన వాహనంతో వారిని తొక్కుకుంటూ తీసుకెళ్లాడు. రైతులు హర్నెక్ సింగ్, మహిమలను వాహనం ఒక కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ సందర్భంలో ఎస్ఏడీ నేతలు రైతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
నిరసనలకు పిలుపు
ఈ ఘోర సంఘటనను ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. హత్యాయత్నానికి పాల్పడిన ఎస్ఏడీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ ఫిరోజ్‌పూర్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భారీ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ నిర్వహించనున్నారు. నవంబర్ 28న ముంబయిలో మరో భారీ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఊపందుకుంది. హర్యానాలో హన్సి ఎస్పీ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా మూడో రోజు కూడా కొనసాగుతున్నది. నిరసనలో వేలాది మంది రైతులు చేరారు. మరోవైపు రైతుల డిమాండ్లను అంగీకరించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిరాకరించారు. హర్యానాలోని కర్నాల్‌లో వరి సేకరణకోసం రైతులు నిరసన చేపట్టారు. ప్రయాగ్‌రాజ్‌లో రైతులు జారి పవర్ హౌస్ నుండి గల్లా మండి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మూడువ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘూ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. నిరసన కారుల్లోని ఓ రైతు బుధవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనిపిం చారు. మృతుడు గుర్ప్రీత్ సింగ్ (45)అని, పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాకు చెందినవాడని పోలీ సులు వెల్లడించారు. గుర్ప్రీత్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్‌లో భాగస్తుడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు కుండ్లీ పోలీసులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సోనిపట్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు.