Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరాన్ని విడిచి వెళ్లాలంటూ బెదిరింపులు
- జార్ఖండ్‌లోని రాంచీలో ఘటన
రాంచీ : ముగ్గురు కాశ్మీరీ యువకులపై దాడి జరిగిన ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటు చేసుకున్నది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశ్మీ ర్కు చెందిన బిలాల్ అహ్మద్, షబ్బీర్ అహ్మద్, వసీమ్ అహ్మద్‌లు డోరండాలోని హతిఖానాలో నివసిస్తున్నారు. వారు అక్కడ ఉన్ని వస్త్రాలు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునేవారు. అయితే, గురువారం వారిపై సోనూ కుమార్ అనే స్థానికుడు దాడి చేశారు. పాకిస్థాన్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేయాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా వీలైనంత త్వరగా నగరాన్ని విడిచి వెళ్లాలంటూ ఆ ముగ్గురుని బెదిరించాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిం చాడు. ఈ విషయంపై బాధితులు డోరండా పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేశారు. బిలాల్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు బాధితులు మాట్లాడుతూ.. ''మేము ఇక్కడ 20 ఏండ్ల నుంచి ఉంటున్నాం. చలికా లంలో కాశ్మీర్ నుంచి ఉన్ని వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాం. అయితే, గత కొన్ని రోజుల నుంచి కొందరు స్థానిక యువకులు మమ్మల్ని రోజూ బెదిరిస్తున్నారన్నారు.