Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి
- రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం ఉన్నామని గుర్తుంచుకోవాలి
- ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి
- 51వ గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి, ప్రజల మధ్య గవర్నర్ ''మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త'' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలనీ, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని గవర్నర్లు గుర్తుంచుకోవాలన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్లో 51వ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో మనమందరం సాధారణ ప్రజలతో ''నిరంతర సంబంధాలు'' కొనసాగించాలని కోవింద్ అన్నారు. ''మీరందరూ కొన్ని కార్యక్రమాల ద్వారా ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలను తప్పనిసరిగా సందర్శించారని నేను కచ్చితంగా కోరుకుంటున్నాను'' అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో గవర్నర్లు చురుకైన సహకారం అందించడం ఈ సదస్సులో పాల్గొన్న వారికి సంతృప్తిని కలిగించే విషయమని ఆయన అన్నారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములై.. ప్రజల్ని చైతన్యపర్చండ్ణి వెంకయ్యనాయుడు
దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్య పరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం పెరగడంలో కృషి చేయడంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావడంలోనూ చొరవ తీసుకోవాలని సూచించారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా, వారి ఉత్పత్తుల విలువను పెంచే చర్యలను కూడా ప్రోత్సహించాలని వారికి ఉపరాష్ట్రపతి సూచించారు.
ఎన్ఈపీ అమలులో గవర్నర్లది కీలక పాత్ణ్ర అమిత్ షా
భారతదేశం నిర్దేశించిన కాప్26 లక్ష్యాలను సాధించేందుకు వీలుగా వాతావరణ మార్పులపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు చొరవ తీసుకోవాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కోరారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన అభ్యర్థించారు. నేటికీ దాదాపు 70 శాతం యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. దేశంలోని 80 శాతానికి పైగా విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారు. మీరు ఈ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్లు. కాబట్టి క్షేత్రస్థాయిలో విద్యా విధానాన్ని అమలు చేయడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది'' అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై, మిజోరం గవర్నర్ హరిబాబు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.