Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరావతి రాజధాని రైతులపై పోలీసుల జులుం.. ఒకరికి తీవ్రగాయాలు
నాగులుప్పలపాడు : అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గురువారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర చదలవాడకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకోడ్ అమలులో ఉందనీ, ఇతరులు పాదయాత్రలో పాల్గొగనకూడదని రాజధాని రైతులకు నోటీసులు అందించారు. సమీప ప్రజలు పాదయాత్రకు మద్దతు తెలపకుండా సుమారు మూడు వేల మంది పోలీసులు బందోబస్తు, బారీకేట్లు ఏర్పాటుచేశారు. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు సమీప గ్రామాల ప్రజలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజేంద్రప్రసాద్ చేరుకున్నారు. పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుంటూ స్థానికులు ముందుకువచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ప్రజలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. నాగులుప్పలపాడు మండలం, చీర్వానుప్పలపాడు గ్రామానికి చెందిన రైతు ఆళ్ల నాగార్జున చెయ్యి విరిగింది. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల నిర్బంధాన్ని దాటుకుంటూ రైతులు పాదయాత్రను కొనసాగించారు.