Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనల నుంచి మినహాయింపు
- పర్యావరణాన్ని సైతం ఫణంగా పెట్టేస్తున్న మోడీ సర్కార్
- హైడ్రోకార్బన్ అన్వేషణ, కార్యకలాపాలపై నిబంధనలకు పాతరేస్తూ ప్రతిపాదన
- ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం లేదు
- సీఆర్‌జెడ్‌కు సవరణ కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్
'పెట్రోలియం ఉత్పత్తుల్లో ప్రధానంగా ఉండేవి హైడ్రోకార్బన్లు. ప్లాస్టిక్, రబ్బర్, సాల్వెంట్లు,
పేలుడు పదార్థాల తయారీలో ప్రధానంగా వీటిని వాడతారు'. ఇది నిఘంటువులో ఉన్న అర్థం.
దీన్ని బట్టి ఆ'జామ్‌నగర్ వీరు''డెవరో ప్రధానమంత్రితో ఆయన మైత్రీ బంధం ఏపాటిదో స్పష్టమే కదా!
న్యూఢిల్లీ : దేశంలో పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల విషయంలోనూ మోడీ సర్కార్ నిబంధనలకు పాతరేస్తున్నది. తాను చేసే ప్రకటనలు, అమలు చేసే విధానాలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. 2070 నాటికి భారత్ కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో కార్బన్ ఎమిషన్) దేశంగా మారుతుందని ఇటీవల ఇంగ్లాడ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్26లో ప్రధాని మోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, మోడీ సర్కారు చర్యలు మాత్రం ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో లేవని దేశంలోని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో పర్యావరణంగా దుర్బలమైన తీర ప్రాంతాల రక్షణకు ఉద్దేశించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే, హైడ్రోకార్బన్ అన్వేషణ, సంబంధిత అభివృద్ధి కార్యకలాపాలను ఆ నియమ, నిబంధనల నుంచి మినహాయించేలా కేంద్రం ప్రతిపాదన చేయడం గమనార్హం. తప్పనిసరి ముందస్తు అనుమతుల నుంచి ఆయిల్, సహజవాయు అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలను మినహాయించేలా భారతదేశ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ (సీఆర్‌జెడ్), 2019కు సవరణ కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు (ఎంఓఈఎఫ్డసీసీ) మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
1న నోటిఫికేషన్.. 2న మోడీ ప్రకటన
దేశంలో కర్బన ప్రమాదానికి దారి తీసే సదరు సవరణ నోటిఫికేషన్ ఈనెల 1న విడుదలైంది. అయితే, తర్వాతి రోజే (నవంబర్ 2న) ప్రధాని మోడీ కాప్26 సమావేశంలో కర్బన రహిత ఉద్గార లక్ష్యాన్ని వెల్లడించడం గమనార్హం. పర్యావరణ, తీర ప్రాంతాల పరిరక్షణ, కర్బన ఉద్గారాలను తగ్గించడం విషయంలో మోడీ సర్కారు చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ రెండు విరుద్ధ చర్యలతో అర్థమవుతున్నదని పర్యావరణ పరిరక్షకులు ఆరోపించారు. కాగా, కేంద్రం ప్రతిపాదించిన ఈ మినహాయింపు నిర్ణయం ప్రయివేటు హైడ్రోకార్బన్ సంస్థలకు లాభాదాయకంగా ఉండనున్నది. ఎందుకంటే ఈ రంగంలోని ప్రభుత్వ సంస్థలను బలహీనపర్చేందుకు కేంద్రం 'చిత్తశుద్ధితో' పని చేస్తున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయివేటుకు 60 శాతం వాటా వదులుకోవాలంటూ ఓన్జీసీకీ కేంద్రం ఆదేశం
ప్రతిపాదిత సవరణను నోటిఫై చేయడానికి కొన్ని రోజుల ముందే.. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు కేంద్రం షాకిచ్చింది. 60 శాతం వాటా వదులుకోవాలనీ, భారత దేశ అతిపెద్ద ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాల నిర్వహణ నియంత్రణను విదేశీ కంపెనీలకు ఇవ్వాలని ఓఎన్జీసీని ఆదేశించింది. అయితే, చట్టం ప్రకారం ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహించడానికి బదులుగా ఆర్థిక సహాయం కోసం పాలక వర్గం ఆధారపడే కార్పొరేటు వ్యాపారాలకు లబ్ది చేకూరే ఏకైక ఉద్దేశంతో పని చేస్తున్నదని 1965వ బ్యాచ్‌కు చెందిన మాజీఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యా నించారు. అలాగే, ఆయిల్ క్షేత్రాల ఉత్పత్తిలో వాటాలను ప్రయివేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర పెట్రోలియం, సహాజవాయువు మంత్రిత్వ శాఖ ఓఎన్జీసీని ఈ ఏడాది ప్రారంభంలో ఆదేశించడం గమనార్హం.
పర్యావరణవేత్తల ఆందోళన
కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పర్యావరణవేత్తలు, సముద్ర పరిరక్షకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యలు పర్యావరణానికి నష్టాన్ని చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. '' భారత దేశ భూసంబంధమైన జీవావరణశాస్త్రం గురించి మనకున్న జ్ఞానంతో పోలిస్తే సముద్ర జీవవైవిధ్యం, ఆవాసాల గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదు. మన సముద్ర ఆవాసాలు, వన్యప్రాణుల ప్రస్తుత స్థితిని, అవి ఎదుర్కొంటున్న వివిధ ఆటంకాలను అంచనావేయకుండా సీఆర్‌జెడ్ అనుమతులు తొలగించే నిర్ణయం సరికాదు'' అని గోవాకు చెందిన పూజా మిత్రా ఆందోళన వ్యక్తం చేశారు.
తీర ప్రాంతం వెంబడి ఉన్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా నేరుగా ప్రభావితమయ్యే స్థానిక సంఘాలతో సంప్రదింపులను కేంద్రం నిర్ణయంతో తోసిపుచ్చినట్టేనని పర్యావరణవేత్తలు ఆరోపించారు.