Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : వీఐటీ- ఏపీ విశ్వ విద్యాలయం తన దత్తత గ్రామాలైన శాఖమూరు, వెలగపూడిలలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ప్రారంభించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జీ బి శేషయ్య ప్రారంభించి మాట్లాడుతూ దేశంలోని సాధారణ పౌరులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. చట్టాలు, న్యాయ సేవలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో వీఐటీ - ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ బెనర్జీ చక్కా, ప్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ మహతి పాల్గొన్నారు.