Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు యూనిట్లలో కీలక వాటాల విక్రయం : చమురు మంత్రిత్వ శాఖ ఒత్తిడి
న్యూఢిల్లీ : నవరత్న కంపెనీ ఓఎన్జీసీ క్షేత్రాలను ప్రయివేటుకు విక్రయించేలా చమురు మంత్రిత్వ శాఖ ఒత్తిడి పెంచింది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్‌కు చెందిన రెండు అతిపెద్ద చమురు, సహజ వాయువు క్షేత్రాల్లో 60 శాతం చొప్పున వాటాల విక్రయానికి వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించినట్టు సమాచారం. ఎన్నో ఏండ్లు కష్టపడి, వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేసి గుర్తించిన క్షేత్రాలను కారు చౌకగా కార్పొరేట్, విదేశీ శక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఓ వ్యక్తి వెల్లడించారు. ఓఎన్జీసీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, సహజ వాయువు కంపెనీ. ఓఎన్జీసీకి చెందిన తూర్పు తీరంలోని చమురు క్షేత్రాలను ఎక్సాన్ మొబిల్ కార్ప్ కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉందని గత నెలలో చమురు శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ పేర్కొన్నారు.