Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60ఏండ్లు దాటినవారిలోనూ ప్రభావం చూపిన వ్యాక్సిన్
- మెడికల్ జర్నల్ 'లాన్సెట్'లో ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ : కోవిడ్-19పై భారత్ బయోటెక్ తయారుచేసిన 'కోవాగ్జిన్' చక్కటి ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలో తేలింది. కరోనా లక్షణాలున్న వారిలోనూ 'కోవాగ్జిన్' ప్రభావంతంగా పనిచేసిందని, వ్యాక్సిన్ సామర్థ్యం 77.8శాతంగా ఉందని ప్రముఖ మెడికల్ జర్నల్ 'ద లాన్సెట్' తాజా ప్రచురణలో పేర్కొన్నది. కోవాగ్జిన్్ ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాల్ని లాన్సెట్ విడుదలచేసింది. 60ఏండ్లులోపు వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 79.4శాతంగా, 60ఏండ్లు పైబడినవారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 66.2శాతంగా ఉందని ఇందులో తెలిపారు. లాన్సెట్ కథనంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. కోవాగ్జిన్్ సామార్థ్యాన్ని అంచనావేయడానికి దేశవ్యాప్తంగా 25 హాస్పిటల్స్లలోని 16,973మందిపై ప్రయోగాలు జరిగాయి. కరోనా రోగ లక్షణాలు బయటకు కనపడే 130మందికీ వ్యాక్సిన్ను ఇచ్చి ఫలితాలు నమోదుచేశారు.