Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా రైతు సాహసోపేత చర్య
న్యూఢిల్లీ : హర్యానాలోని గోహనాలో బీజేపీ నాయకుడు, రాష్ట్ర సహకార మంత్రి బన్వారీ లాల్ నుంచి అవార్డును స్వీకరించేందుకు చెరకు రైతు నిరాకరించారు. గోహనా చక్కెర కర్మాగారంలో క్రషింగ్ సీజన్‌ను ప్రారంభించేందుకు మంత్రి గోహనాకు వెళ్లారు. గత సీజన్లో అత్యధికంగా చెరకును సరఫరా చేసిన రైతును సత్కరించాలని భావించారు. అయితే, కొనసాగుతున్న రైతు ఉద్యమంలో వందలాది మంది రైతులు బలిదానం చేస్తున్నప్పుడు తాను అవార్డును స్వీకరించలేనని రైతు సురేంద్ర లాత్వాల్ వేదికపైనే సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది అతడిని కిందికి లాగి.. అమర్యాదగా తోసేశారు. సురేంద్ర లాత్వాల్ని సాహసోపేతమైన, నైతిక విలువలతో కూడిన చర్యను ఎస్కేఎం అభినందించింది. అలాగే మంత్రికి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలపటంతో జింద్‌లో తన కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించగా, తాజాగా రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. పంజాబ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం రద్దు, రాష్ట్ర ఎపిఎంఎసి చట్ట సవరణ బిల్లులను చరణ్‌జిత్ చన్నీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తద్వారా మూడు కేంద్ర నల్ల చట్టాలను కూడా రద్దు చేయాల్సిన అవసరం గురించి మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపింది.