Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కంపెనీల చరిత్రలోనే అత్యధికం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఒఎన్జీసీ భారత కార్పొరేట్ కంపెనీల చరిత్రలోనే సరికొత్త రికార్డ్‌ను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఏకంగా 565 శాతం వృద్థితో రూ.18,347 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇదే క్యూ2లో రిలయన్స్ ఇండిస్టీస్ అత్యధికంగా 15,479 కోట్ల లాభాలు ఆర్జించింది. భారత కంపెనీల చరిత్రలో ఇది వరకు ఎప్పుడూ ఏ ఒక్క కంపెనీ ఒక త్రైమాసికంలో రూ.18వేల కోట్ల పైన లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవు. క్రితం క్యూ2లో ఒఎన్‌జిసి రెవెన్యూ 44 శాతం పెరిగి రూ.24,353 కోట్లకు చేరింది. 2021-22గాను మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ షేర్‌పై రూ.5.50 డివిడెండ్‌ను ప్రకటించింది.