Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో ఘోరం
అహ్మదాబాద్ : గుజరాత్లోని పటాన్ జిల్లాలో కొంతమంది గ్రామస్తులు 14 ఏండ్ల బాలికకు శిరోముండనం చేసి, ముఖానికి మసి పూసి, ఊరేగించారని పోలీసులు శనివారం తెలిపారు. తనకు ఇష్టమైన వ్యక్తితో ఆమె వెళ్లిపోయిందనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 22మందిని అరెస్టు చేశారు. ఈ నెల 10న హర్జి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ బాలిక తన ప్రియుడితో వెళ్లిపోవడం వల్ల తమ తెగకు చెడ్డపేరు వస్తుందని, అందుకే తాము ఈ శిక్ష వేశామని వాడి గిరిజన తెగకు చెందిన గ్రామస్తులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు.