Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టయిన రైతులకు రూ.2లక్షల సాయం
- పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలిపింది. ఢిల్లీ 'ట్రాక్టర్ ర్యాలీ'లో అరెస్టయిన రైతులకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది రైతులు గతేడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. నిరసనల్లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతించని మార్గాల్లో రైతుల నిరసన కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు అడ్డుపడ్డారు. చారిత్రక ఎర్రకోటను ముట్టడించటం, కోటపై జెండా ఎగురవే యటం..వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రోజు నిరసనల్లో పాల్గొన్న రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 83మంది రైతులను అరెస్టు చేశారు.