Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా 11,850 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లు విజృంభించే అవకాశముందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దేశంలో కొత్తగా కేసులు, మరణాలు పెరుగుతుండటం కలవరం రేపుతున్నది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్‌తో పోరాడుతూ 555 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,26,036కు చేరగా, మరణాల సంఖ్య 4,63,245కు పెరిగింది. ఇప్పటివరకు 3,38,26,483 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,36,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,11,40,48,134 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త కేసులు అధికం కావడం, కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకురావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. కొత్త వేరియంట్లు వ్యాక్సిన్ తట్టుకునే శక్తిని కలిగివుండే అవకాశాలున్నాయనీ, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 253,420,051 కేసులు, 5,108,151 మరణాలు నమోదయ్యాయి.