Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతికి స్వాతి మలివాల్ లేఖ
న్యూఢిల్లీ : 1947లో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని, పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. 1947లో కాకుండా 2014లో వచ్చిందే అసలైన స్వాతంత్య్రం అంటూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని ఉద్దేశించి .. కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. కంగనా చేసిన వ్యాఖ్యలు .. దురుద్దేశంతో చేసినట్లుగా కనిపిస్తోందని, స్వదేశంలోని ప్రజలపై అలవాటుగా ఆమె విషం చిమ్ముతున్నారని, ఆమెను అంగీకరించని వారిపై నీచమైన పదజాలాన్ని వినియోగిస్తున్నారని లేఖలో స్వాతి పేర్కొన్నారు. విద్రోహ స్వభావం ఉన్న ఆమె వ్యాఖ్యలను తక్షణమే గుర్తించాలని కోరారు. ఆమె వ్యాఖ్యలు మహాత్మాగాంధీ, భగత్ సింగ్ వంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారిపై ద్వేషాన్ని కల్గించేలా ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
బీహార్‌లో జర్నలిస్ట్, ఆర్టిఐ కార్యకర్త కిడ్నాప్, కాలిన స్థితిలో మృతదేహం గుర్తింపు..
నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన జర్నలిస్ట్, ఆర్టిఐ కార్యకర్త మృతదేహం బీహార్‌లోని మధుబని జిల్లాలో రోడ్డు పక్కన కనిపించింది. మృతదేహాన్ని కాల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఘటన బీహార్‌లో జరిగింది. బుద్ధినాథ్ ఝా అలియాస్ అవినాష్ ఝా స్థానిక న్యూస్‌పోర్టల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నకిలీ మెడికల్ క్లినిక్‌ల పేరుతో ఒక కథనాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఈ కథనంతో కొన్ని క్లినికల్‌ను మూసివేయగా, మరికొన్నింటిపై భారీ జరిమానాలు విధించడం జరిగింది. దీంతో ఈ కథనం అప్లోడ్ చేసిన రెండు రోజుల అనంతరం అతను అదృశ్యమయ్యాడు. శుక్రవారం బిటౌన్ గ్రామానికి సమీపంలోని హైవేపై ఒక మృతదేహం కనిపించినట్లు బుద్ధినాథ్ సోదరుడు బిజె.వికాస్‌కు సమాచారం అందింది.