Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి మరో తుపాన్ ముప్పు
- వాతావరణశాఖ హెచ్చరిక
అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని జవాద్ తుపాన్ ముప్పు వణికిస్తోంది. థారుల్యాండ్, అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా మారుతుందనీ, ఇది మరింత బలపడి 17, 18 తేదీలలో తుపాన్‌గా మారే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రాలు తెలిపాయి. తుపాన్‌గా మారి తే, దీనికి జవాద్ అని పేరు పెట్టనున్నారు.రాష్ట్ర తీరానికి ప్రస్తుతం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడన ప్రభావం సోమవారం నుండి రాష్ట్రంపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసింది. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్ఫాలు కురిసే అవకాశం ంఉదని, 16వ తేది విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 18వ తేది తీరం దాటే అవకాశం ఉందని అంచనా! అప్పటి వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.