Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవుల పేడ, మూత్రంతో వ్యక్తుల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తాయని చౌహాన్ అన్నారు. తాజాగా ఇండి యన్ వెటర్నరీ అసోసియేషన్ నిర్వహించిన మహిళా పశువైద్యుల సదస్సు 'శక్తి 2021'లో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''ఆవుల పేడ, మూత్రంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. దీనికోసం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మధ్యప్రదేశ్ శ్మశానవాటికల్లో కలప వినియోగాన్ని తగ్గించేందుకు ఆవుల పేడతో చేసిన దుంగలు ఉపయోగిస్తున్నారు'' అని అన్నారు. అలాగే, చిన్న రైతులు, పశువుల యజమానులకు ఆవుల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మారుతుందనే దానిపై వెటర్నరీ వైద్యులు, నిపుణులు పరిశోధనలు సాగించాలని సూచించారు.