Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలి
- రైతు, కార్మిక సంఘాల పిలుపులకు మద్దతు : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరల మోత మోగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ఎలాంటి ఊరట లభించదు. ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.33, లీటర్ డీజిల్‌పై రూ.32 ఎక్సైజు సుంకాల రూపంలో పిండుకుం టున్న నేపథ్యంలో ఈ తగ్గింపు చాలా నామ మాత్రం. అది కూడా రాష్ట్రాలతో పంచుకుంటున్న ఎక్సైజ్ సుంకాన్ని మాత్రమే తగ్గించింది. రాష్ట్రాలతో పంచుకోని ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (సర్‌చార్జీలు) రూ.74,350 కోట్లు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ (సెస్) రూ.1,98,000 కోట్లు, ఇతర సెస్, సర్‌చార్జీలు రూ.15,150 కోట్లు, మొత్తంగా రూ.2.87 లక్షల కోట్లు కేంద్రం నేరుగా తన ఖాతాలో వేసుకుంటోంది. వీటిని రాష్ట్రాలతో పంచుకోవడంలేదు. ఈఅదనపు సెస్, సర్‌చార్జీలను తక్షణమే ఉపసంహరించు కుని ప్రజలకుఅర్థవంతమైన ఉపశమనం కలిగించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇక్కడ సమావేశమైన పార్టీ పొలిట్‌బ్యూరో ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది.
రాఫెల్ స్కామ్
రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తులకు ముడుపు లు చెల్లింపునకు సంబంధించి ఫ్రెంచ్ మీడియా పార్ట్ తాజాగా ఆధారాలను, ఇందుకు సంబం ధించిన పత్రాలను బయటపెట్టినా, ఈ వ్యవహా రంలో డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఏ విధంగా లాభపడిందీ తెలియజేసే అధికారిక చర్చల వివ రాలు బయటకొచ్చినా ఈకుంభకోణంపై దర్యాప్తు నకు మోడీప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తున్నది.
రాఫెల్ ఒప్పందంలో ఉన్నత స్థాయిలో జరిగిన అవినీతిని కప్పిపెట్టేందుకు మోడీ సర్కార్ చేస్తున్న యత్నాలు తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నాయి. ఇతర దేశాలలోని ప్రభుత్వాలు ఏదో ఒక పద్ధతిలో దర్యాప్తునకు ఆదేశించినా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి దర్యాప్తునకు ససేమిరా అంటోంది. ఈ ఒప్పందంపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
రైతు, కార్మిక సంఘాల పిలుపులకు మద్దతు
చారిత్రాత్మక రైతు ఉద్యమ ప్రథమ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఢిల్లీ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో రైతు ఉద్యమం మొదటి వార్షికోత్సవం, లేబర్ కోడ్లు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సాగించిన చారిత్రాత్మక పోరాటాలకు ఏడాది అయిన సందర్భంగా ఆ సంఘాలు ఇచ్చి న పిలుపులకు పొలిట్‌బ్యూరో తన పూర్తి మద్ద తును, సంఘీభావాన్ని ప్రకటించింది. వీటితో బాటు ధాన్యం సేకరణ, మైనార్టీలపై దాడులు తదితర అంశాలను కూడా పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో ప్రస్తావించింది.జనసమీకరణ చేసి, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా తీసుకున్న నిర్ణయానికి పొలిట్ బ్యూరో తన మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించింది. అలాగే లేబర్ కోడ్ల రద్దు, పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ, దేశ ఆస్తుల లూటీని ఆపాలి తదితర డిమాండ్లతో కార్మికవర్గం చేసిన చారిత్రాత్మక సమ్మె మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు పొలిట్ బ్యూరో తన మద్దతు ప్రకటించింది.
ధాన్యం సేకరణ
కేంద్ర గోడౌన్లు అన్నీ నిండిపోయాయనే వితండ వాదనతో కొన్ని రాష్ట్రాల నుంచి ఎంఎస్పి ధరలకు ధాన్యం సేకరించకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పొలిట్‌బ్యూరో ఖండించింది. గోదాముల్లో ఆహార ధాన్యాలను ముక్కబెట్టే బదులు వాటిని అవసరమైన వారికి ఉచితంగా పంపిణీ చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. నల్ల చట్టాలను రద్దు చేయాలని, అన్ని పంటలనూ ఎంఎస్పీ ధరలకు అమ్ముకునేలా చట్టబద్ధమైన హక్కు కల్పించాలని కోరుతూ ఏడాదిగా రైతులు చారిత్మ్రాక ఉద్యమం సాగిస్తున్న సమయంలో కేంద్రం ఇలాంటి క్రూరమైన నిర్ణయం తీసుకోవడం దాని లెక్కలేనితనాన్ని తెలియజేస్తోంది.అన్ని పంటలనూ ఎంఆర్పీ ధరలకు కేంద్రం సేకరించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
మైనార్టీలకు వ్యతిరేకంగా దాడులను నిరోధించాలి
దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెద్దయెత్తున కొనసాగుతున్నట్టు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాల మద్దతు ఉండబట్టే మితవాద గ్రూపులు ఇటువంటి నేరాలను శాశ్వతం చేసేందుకు ఇంతగా బరితెగిస్తున్నాయి. బాధితులను రక్షించడానికి బదులు వారిని, వారి మద్దతుదారులను క్రూరమైన చట్టాల కింద అరెస్టు చేసి శిక్షిస్తున్నది. త్రిపురలో మూకుమ్మడి హింస, ఇటీవల త్రిపురలో జరిగిన హింస ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా జరిగిందని అనుకోలేము. ఈ దాడుల గురించి ఎవరైనా రిపోర్టు చేస్తే వారిపై ఉపా చట్టం కింద కేసులు బనాయిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో, ముస్లింలకు వ్యతిరేకంగా అనేక 'ఎన్కౌంటర్ల'తో పాటు, ఎన్‌ఎస్‌ఎను ప్రయోగించడం సర్వసాధారణమైపోయింది. జాతీయ రాజధాని ప్రాంతం(ఎస్ఎస్ఎ)లోని గుర్గావ్లో ఇటీవలి సంఘటనలను పరిశీలిస్తే, ప్రార్థనలు చేసే ప్రాథమిక హక్కును కూడా హరించివేస్తున్నారని స్పష్టమవుతుంది.ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో క్రైస్తవులపై 300 దాడులు చోటుచేసుకున్నట్టు మానవ హక్కుల సంఘాలు ఇటీవల విడుదలజేసిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదయిన వాటిలోనూ కదలిక లేదు. దాడులకు గురైనవారిలో చాలా మంది దళిత, ఆదివాసీ తెగలకు చెందినవారే. చర్చిలనూ ధ్వంసం చేస్తున్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా, మన లౌకిక చట్రాన్ని ప్రమాదంలో పడవేసేలా మైనారిటీలపై జరుగుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన దినం పాటించాలని తన అన్ని శాఖలకు పొలిట్ బ్యూరో పిలుపునిచ్చింది.
బీఎస్ఎఫ్ అధికార పరిధి పొడిగింపును ఉపసంహరించుకోండి
ఇప్పటి వరకు పంజాబ్, పశ్చిమ బెంగాల్, అసోంల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉన్న సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) అధికార పరిధిని 50 కిలోమీటర్ల వరకు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాల హక్కులపైన, మన రాజ్యాంగం ప్రాథమిక లక్షణమైన సమాఖ్య వ్యవస్థపైన దాడి చేయడమే, రాష్ట్రాలను సంప్రదించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. భారత రాజ్యాంగం ప్రకారం పోలీసింగ్, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. గనుక ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.