Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే ఏడాదితో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించి 75ఏళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా గిరిజనులు అందించిన సేవలను గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ చెప్పారు. ఇందుకోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఏడాది నవంబరు 15న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా పాటిస్తామని ప్రధాని ప్రకటించారు. గిరిజనులకు గర్వకారణమైన ఈ రోజున మొదటగా భగవాన్ బిర్సా ముండా మెమోరియల్‌ను మోడీ రాంచిలో ప్రారంభించారు. మరో 9 ఇటువంటి గిరిజన మ్యూజియాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, చత్తీస్ఘడ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరాం, గోవాల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆధునిక విద్యలో బిర్సా ముండాకు విశ్వాసముందని, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని వినిపించారని మోడీ పేర్కొన్నారు.
మధ్య్పప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పునరుద్ధరించిన రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ను మోడీ సోమవారం ప్రారంభించారు. గతంలో దీన్ని హబీబ్‌గంజ్‌గా పిలిచేవారు. భోపాల్‌లోని గోండుల రాజ్యానికి రాణి పేరును ఈ స్టేషన్‌కు పెట్టారు.