Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ ఉద్యోగుల సభలో స్థితప్రజ్ఞ
నవతెలంగాణ - డెహ్రాడూన్
పాతపింఛన్ను సాధించేదాకా విశ్రమించేది లేదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ చెప్పారు. సోమవారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాత పింఛన్ కోసం ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ మహాసభ జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఉద్యోగులు ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతను పాలకులు షేర్‌మార్కెట్ పాలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 76 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ స్కీంను అమలు చేసే మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ఉత్తరప్రదేశ్ నాయకులు విజరుకుమార్ బంధు, హర్యానా నేత దరివాల్సింగ్, ఉత్తరాఖండ్ నేత జిత్మని పైనుల్లి తదితరులు పాల్గొన్నారు.