Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్టోరల్ బాండ్లపై నిపుణులు
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయపార్టీలకు ఒక వ్యక్తి గానీ, సంస్థ గానీ విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ పేరు బయటపడదు. ముఖ్యంగా, కార్పొరేటు సంస్థలు తమ స్వప్రయోజనాల కోసం ఎలక్టోరల్ బాండ్లను ఆయుధంగా వాడుకుంటున్నాయని విశ్లేషకులు వివరించారు.
'' రాజకీయ పార్టీలకు ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వడానికి కార్పొరేట్లకు ఎలక్టోరల్ బాండ్లు అనుమతినిస్తాయి. అయితే, అధికార పార్టీ తన అధికార బలంతో ఆ కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తాయన్నదే ఆందోళన'' అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి 'గోప్యమైన విరాళాలు' ఎంతమాత్రమూ మంచిది కాదనీ, ఇందులో పారదర్శకత అవసరమని విశ్లేషకులు చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందే విరాళాల్లో నియంత్రణ చాలా అవసరమని వారు సూచించారు. ఒక్క 2019-20లోనే రాజకీయపార్టీలు రూ. 3,429 కోట్ల విరాళాలను పొందాయి. ఇందులో ఒక్క అధికార బీజేపీనే అత్యధికంగా రూ. 2,606 కోట్లను (76 శాతం) పొందిన విషయాన్ని నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతమొత్తంలో విరాళాలను పొందిన బీజేపీ నిజంగా ప్రజాస్వామ్యయుతంగా పాలనను కొనసాగిస్తుందా? విరాళాలు అందించిన కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే ప్రయత్నాలను చేకూర్చదా? అని ప్రశ్నించారు.